చాట్రాయి మండలం పోలవరంలో జరిపిన దాడులలో 400 లీటర్ల బెల్లపు ఊటను ద్వంసం చేసి బిలుగుది చిట్టి బాబుపై కేసు నమోదు చేసినట్లు నూజివీడు ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ ఏ. మస్తానయ్య శుక్రవారం తెలిపారు. చాట్రాయి మండలంలో బెల్ట్ షాపులు నిర్వహించే వారి పైన నాటు సారాయి తయారుచేసిన, నాటు సారా తయారీ ఉపయోగించే బెల్లపు ఊట కలిగి ఉన్న భూ యజమానుల పైన కూడా కేసులు నమోదు చేస్తామని ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ ఏ మస్తానయ్య హెచ్చరించారు.