నిర్భందాలతో ప్రజా ఉద్యమాలను ఆపలేరిన సీఐటీయూ భవన నిర్మాణ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి నారపల్లి రమణరావు విమర్శించారు. శుక్రవారం ఏలూరు జిల్లా ఆగిరిపల్లిలో ముఖ్యమంత్రి సభ సందర్భంగా నారపల్లిని తెల్లవారు జామున బువ్వనపల్లి ఆయన స్వగృహం నందు పోలీసులు నిర్భంధం చేసారు. కూటమి ప్రభుత్వం ఎన్నికలలో ఇచ్చిన హామీలును అమలు చెయ్యాలని నారపల్లి డిమాండ్ చేశారు.