సంక్రాంతి పండుగ సందర్భంగా ఎటువంటి కోడిపందాలు నిర్వహించిన కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని ఆగిరిపల్లి ఎస్ఐ శుభ శేఖర్ హెచ్చరించారు. గురువార రాత్రి ఆగిరిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో పేకాట, జూదం కోడిపందాలు లాంటి చర్యలు చేపడితే చట్ట పరిధిలో చర్యలు తీసుకోవడం జరుగుతుందని ప్రజలకు అవగాహన కల్పించారు. పండుగ సందర్భంగా సాంస్కృతిక క్రీడలను ప్రజలు ప్రోత్సహించాలని విజ్ఞప్తి చేశారు. కోడిపందాలకు దూరంగా ఉండాలన్నారు