సుంకొల్లులో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కు వరిగడ్డి దగ్ధం

59చూసినవారు
సుంకొల్లులో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కు వరిగడ్డి దగ్ధం
నూజివీడు మండలం సుంకొల్లు గ్రామంలో విద్యుత్ షార్ట్ సర్క్యూట్తో బుధవారం గడ్డివాము దగ్ధమయ్యింది. పశువుల మేత కోసం రైతు కొలుసు మురళి ట్రాక్టర్ పై గడ్డి తీసుకువస్తుండగా కిందకు వేలాడుతున్న విద్యుత్ వైర్లు తగలడం వలన అగ్నికి ఆహుతి అయింది. కిందకు వేలాడుతున్న విద్యుత్తు వైర్లపై అధికారులకు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసిన స్పందించలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 50 వేల రూపాయలు నష్టం వాటిల్లిందన్నారు.

సంబంధిత పోస్ట్