నూజివీడు పట్టణానికి చెందిన కోడి కత్తులు కట్టే వ్యక్తిని నూజివీడు పోలీసులు శనివారం అరెస్ట్ చేశారు. నూజివీడు టౌన్ సిఐ సత్య శ్రీనివాస్, ఎస్ఐ జ్యోతిబాసుల ఆధ్వర్యంలో స్థానిక పట్నాల తిరుపతయ్య ఇంట్లో సోదాలు చేయగా 102 కోడి కత్తులు స్వాధీనం చేసుకున్నట్లు డిఎస్పి ప్రసాద్ తెలిపారు. తిరుపతిపై కేసు నమోదు చేస్తున్నట్లు తెలిపారు.