చాట్రాయి మండలం చిన్నంపేట గ్రామంలోని పాస్టర్ జాషువా మోజస్ ఆధ్వర్యంలో మట్టల ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పాస్టర్ జాషువా మోసెస్ మాట్లాడుతూ క్రీస్తు చూపిన మార్గంలో ప్రతి ఒక్కరు నడవాలని, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించమని క్రీస్తు బోధించారని సర్వపాప మానవాళి నిమిత్తము ఆయన ప్రాణాలు త్యాగం చేశారని తెలిపారు. ఈ కార్యక్రమంలో చర్చి సంఘ సభ్యులు ప్రజలు పాల్గొన్నారు.