ఆగిరపల్లి మండలం ఆగిరపల్లి గ్రామంలో వేంచి ఉన్న శ్రీ శ్రీ శ్రీ శోభనాచల వ్యాఘ్ర లక్ష్మీ నరసింహస్వామి వారి సన్నిధిలో రధ సప్తమి వేడుకలు రంగ రంగ వైభవంగా జరిగాయి. స్వామి వారి రధ సప్తమి ఉత్సవాలకు మంగళవారం ముఖ్య అతిథిగా మంత్రి పార్థసారధి హాజరు అయ్యారు. ప్రజలు నాయకులు పెద్దలు మహిళలు చిన్నారులు కోలాట భజనలతో భాజా భజింత్రాలతో మేల తాలాలతో బాణా సంచల వెలుగులతో పూల వర్షంతో గ్రామస్తులు ఘనంగా స్వాగతం పలికారు.