ముసునూరు: ప్రకృతి వ్యవసాయంపై అవగాహన కలిగి ఉండాలి

71చూసినవారు
ముసునూరు: ప్రకృతి వ్యవసాయంపై అవగాహన కలిగి ఉండాలి
రైతులందరూ పంట మార్పిడి విధానం అలవర్చుకోవాలని, ప్రకృతి వ్యవసాయం వైపు రైతులు దృష్టి సారించాలని ముసునూరు మండల వ్యవసాయ అధికారి సూరిబాబు అన్నారు. మంగళవారం రైతు భరోసా కేంద్రంలో ప్రకృతి వ్యవసాయంపై ఎం. టి కాంతమ్మ ఆధ్వర్యంలో రైతులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బిజెపి పార్టీ మండల అధ్యక్షులు బడుగు శ్రీకాంత్ మరియు ఏఓ సూరిబాబు ప్రకృతి వ్యవసాయ రైతులను దుశాల్వా కప్పి ఘనంగా సన్మానించారు.

సంబంధిత పోస్ట్