లోకేష్ పాదయాత్రలో ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు యువతకు ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చాలని ముసునూరు జడ్పిటిసి ప్రతాప్ డిమాండ్ చేశారు. మంగళవారం ముసునూరులో యువత పోరు కార్యక్రమానికి సంబంధించి వాల్ పోస్టర్ ను విడుదల చేశారు. కూటమి ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీ ఇప్పటికీ 9 నెలలైనా ఒకటి కూడా అమలుపరచలేదని ఆయన విమర్శించారు. పరిపాలన అంటే వైయస్ రాజశేఖర్ రెడ్డి తర్వాత జగన్మోహన్ రెడ్డి అని ఆయన కితాభించారు.