ఆషాడ మాసాన్ని పురష్కరించుకుని నూజివీడు పాత శివాలయంలో శనివారం భక్తులు అమ్మవారికి సారే సమర్పించారు. పట్టణంలోని పలు ప్రాంతాల నుంచి భక్తులు 108 ప్రత్యేక వంటకాలు, మేళతాళాలతో ఊరేగింపుగా ఆలయానికి చేరుకున్నారు. ప్రతి ఆషాడ మాసంలో అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసి సారే సమర్పించడం పరంపరగా కొనసాగుతోందని అర్చకులు కుమార్ తెలిపారు.