నూజివీడు ఆర్జీయూకేటీలో చదువుతున్న విద్యార్థులకు ఎన్పీటీసీఎల్ కోర్సులను అమలు చేయడానికి సంబంధించి ఐఐటీ మద్రాస్ ఎన్పీటీసీఎల్ బృందంతో జరిపిన చర్చలు సఫలమయ్యాయి. శుక్రవారం ఆర్జీయూకేటీ నాలుగు క్యాంపస్లలో చదువుతున్న విద్యార్థుల సంఖ్యను దృష్టిలో ఉంచుకొని ఫీజు సడలింపు కల్పించేందుకు సానుకూలంగా స్పందించారు. కార్యక్రమంలో సెంట్రల్ డీఎన్ డి. శ్రావణి, సెంట్రల్ ప్లేస్మెంట్ ఆఫీసర్ టి. శ్యామ్, తదితరులు పాల్గొన్నారు.