ఆగిరిపల్లిలో వేంచేస్తున్న శ్రీ శోభనాచల స్వామి ఆలయ ఉత్సవాలు ఏర్పాట్లను నూజివీడు రూరల్ సిఐ రామకృష్ణ సోమవారం రాత్రి పరిశీలించారు. ఈ సందర్భంగా భక్తులకు ఎటువంటి ఆటంకాలు కలగకుండా కమిటీ వారు జాగ్రత్తలు తీసుకోవాలని ఆయన సూచించారు. ఉత్సవాలకు సంబంధించి ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటున్నట్లుగా సీఐ తెలిపారు. స్వామి దర్శనానికి విచ్చేసే భక్తులకు సౌకర్యాలు కల్పించినట్లు కమిటీ వివరించింది.