దేశ సేవ, జనహితం కోరే నాయకత్వంతో భారతీయ జనతా పార్టీ ప్రంపంచంలోనే అతి పెద్ద రాజకీయ పార్టీగా అవతరించిందని బిజెపి ఏలూరు జిల్లా అధ్యక్షులు చౌటపల్లి విక్రమ్ కిషోర్ అన్నారు. శనివారం నూజివీడులో జిల్లా కోశాదికారి మాటూరి రవికాంత్ కార్యాలయంలో జరిగిన నియోజకవర్గ స్థాయి క్రియాశీలక సభ్యుల సమావేశానికి విక్రమ్ కిషోర్ ముఖ్యఅతిధిగా విచ్చేశారు. ఈ సమావేశానికి కార్యక్రమ కో ఆర్డినేటర్ మాగంటి వాసు అధ్యక్షత వహించారు.