వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా కమిటీలో నూజివీడు నియోజకవర్గం చోటు దక్కింది. ఈ మేరకు శనివారం నూజివీడు మాజీ ఎమ్మెల్యే మేక వెంకట ప్రతాప్ అప్పారావును కమిటీలో ప్రాధాన్యత పొందిన నాయకులు అభినందనలు తెలిపారు. ముసునూరు మండలం నుండి తొర్లపాటి శ్రీనివాసరావు జిల్లా కమిటీలో సెక్రటరీగా స్థానం లభించింది. జిల్లా ఉపాధ్యక్ష పదవి ఆగిరిపల్లి కి చెందిన పలగాని నరసింహారావుకు దక్కింది. పలువురు మాజీ ఎమ్మెల్యేను కలిశారు.