నూజివీడులోని ముడుపల్లి తాతయ్య ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్మీడియట్ విద్యార్థుల కోసం ప్రవేశపెట్టిన డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పధకాన్ని ఘనంగా మంత్రి కొలుసు పార్థసారథి శనివారం ప్రారంభించారు. అనంతరం విద్యార్థులతో కలిసి భోజనం చేస్తూ వారితో ముచ్చటిస్తూ హాస్టల్ సౌకర్యాలు, టీచింగ్ విధానాలను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో కళాశాల సిబ్బంది పాల్గొన్నారు.