నూజివీడు: రోడ్డు ప్రమాదంలో ఎమ్మార్పీఎస్ నాయకులు దుర్మరణం

61చూసినవారు
నూజివీడు: రోడ్డు ప్రమాదంలో ఎమ్మార్పీఎస్ నాయకులు దుర్మరణం
నూజివీడు ఎమ్మార్పీఎస్ సీనియర్ నాయకులు భాస్కర్ శర్మ గురువారం రాత్రి రోడ్డు ప్రమాదంలో దుర్మరణం పాలయ్యారు. ఉమ్మడి కృష్ణా జిల్లాలోని గన్నవరం మండలం పిన్నమనేని సిద్ధార్థ కళాశాల సమీపంలో ఈ రోడ్డు ప్రమాదం జరిగినట్లుగా బంధువులు తెలిపారు. మరో వ్యక్తి ద్విచక్ర వాహనం నడుపుతుండగా భాస్కర్ శర్మ వాహనం వెనుక కూర్చున్నారు. ఎదురుగా వస్తున్న వాహనం ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగినట్లుగా పోలీసులు తెలిపారు.

సంబంధిత పోస్ట్