నూజివీడు త్రిబుల్ ఐటీ ఆవరణలో ఒంగోలు త్రిబుల్ ఐటీ ప్రవేశాలకు నిర్వహించిన రెండో రోజు కౌన్సిలింగ్ శనివారంతో ముగిసింది. 536 మంది అభ్యర్థులను ఆహ్వానించగా 397 మంది హాజరై ప్రవేశాలు పొందారు. వీరిలో 126 మంది బాలురు, 271 మంది బాలికలు ఉన్నారు. రెండు రోజుల కౌన్సిలింగ్‌లో 1010 సీట్లలో 827 సీట్లు భర్తీ కాగా,183 సీట్లు మిగిలాయి.