జిల్లాలో ప్రతిష్టాత్మకంగా నాటు సారాను పూర్తిగా అరికట్టేందుకు అహర్నిశలు కృషి చేస్తున్నట్లు ప్రొహిబిషన్, ఎక్సైజ్ శాఖ ఏలూరు జిల్లా అసిస్టెంట్ కమిషనర్ ప్రభు కుమార్ స్పష్టం చేశారు. నూజివీడులోని ప్రొహిబిషన్, ఎక్సైజ్ శాఖ సర్కిల్ కార్యాలయంలో నవోదయం 2. 0 రివ్యూ కార్యక్రమం బుధవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన స్థానిక పాత్రికేయులతో మాట్లాడుతూ ఈ ఏడాది ఫిబ్రవరి 19 నుండి నవోదయం 2. 0 అనే కార్యక్రమం జరుగుతుందన్నారు.