ప్రజల సేవలో కార్పొరేట్ సంస్థలు భాగస్వాము లు కావడం అభినందనీయమని రాష్ట్ర గృహ నిర్మాణ శాఖా మంత్రి కొలుసు పార్థసారధి అన్నారు. నూజివీడు ఆసుపత్రికి వెలగపూడి రాజకుమార్ ట్రస్ట్ వారు అందించిన 13 లక్షల రూ. విలువైన వైద్య పరికరాలను శుక్రవారం మంత్రి ప్రారంభించారు. వెలగపూడి రాజకుమార్ ట్రస్ట్ అధినేతలు నూజివీడు ఏరియా ఆసుపత్రికి 13 లక్షల రూపాయలు విలువ చేసే నేత్ర పరీక్షకు సంబందించిన పరికరాలు అందించారు.