నూజివీడు: సీఐటీయూ ఆధ్వర్యంలో కార్మికుల ఆందోళన

54చూసినవారు
నూజివీడు పట్టణంలోని చిన్న గాంధీ బొమ్మ సెంటర్ వద్ద సీఐటీయూ ఆధ్వర్యంలో మున్సిపల్ కార్మికులు శుక్రవారం ఆందోళన నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న సీఐటీయూ నేత రాజు మాట్లాడుతూ. కార్మిక వ్యతిరేక విధానాలు అవలంబిస్తున్న కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర కూటమి పాలకులు మద్దతు పలకటం దారుణం అన్నారు. ఔట్సోర్సింగ్, కాంట్రాక్ట్ కార్మికులను తక్షణమే పర్మినెంట్ చేయాలన్నారు. 8 గంటల పని విధానం అమలు కావాలన్నారు.

సంబంధిత పోస్ట్