కేంద్రం రాష్ట్రప్రభుత్వాలు కరెంటు ఛార్జీలు పెంచడం, వ్యవసాయ పంపుసెట్లకు మీటర్లు పెట్టటం పరిపాటిగా మారిందని సిపిఎం పార్టీ మండల కార్యదర్శి కొడవలి శ్రీనివాస్ విమర్శించారు. ఆదివారం మండల కేంద్రమైన మండపం సెంటర్ వద్ద విద్యుత్ చార్జీలు పెంపు పై వ్యవసాయ విద్యుత్ పంపు సెట్లు బిగించడం పై నిరసనగా కరపత్రాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కోడవలి శ్రీనివాస్ మాట్లాడుతూ, విద్యుత్ చార్జీలు పెంచడం దారుణం అన్నారు.