చాట్రాయి మండలం కొత్తగూడెం గ్రామపంచా యతీ ఎర్ర వారి గూడెంలో గత సంవత్సరము తాత్కాలికంగా మూసిన మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలను విద్యాశాఖ అధికారి వి ఎస్ వి బ్రహ్మాచారి శుక్రవారం పునః ప్రారంభించారు. విద్యార్థులను సక్రమంగా పాఠశాలకు పంపి పాఠశాల భవిష్యత్తులో మూతపడకుండా నిలపాలని ఆయన కోరారు. గ్రామ ఉపసర్పంచ్ మంచిన శ్రీనివాసరావు, మాజీ సర్పంచ్ చల్లగుల్ల రాజారత్నం, మాజీ ఉపసర్పంచ్ శ్రీనివాసరావు పాల్గొన్నారు.