రేపు ఏలూరు నగరంలోని జరగవలసిన కల్లుగీత కార్మికుల మద్యం షాపుల డ్రా వాయిదా పడినట్లు ప్రొహిబిషన్ ఎక్సైజ్ సీఐ ఏ మస్తానయ్య తెలిపారు. నూజివీడులో ఆయన ఆదివారం మాట్లాడుతూ ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో ఎలక్షన్ కమిషన్ నుండి అనుమతి లభించిన తరువాత డ్రా తేదీని ప్రకటించడం జరుగుతుందన్నారు. ఈ విషయం కల్లుగీత కార్మికులు గమనించాలని సూచించారు. ఉన్నతాధికారులు ప్రకటించే తదుపరి తేదీలను అనుసరించి డ్రా కొనసాగుతుందన్నారు.