ముసునూరులో ఇద్దరు బుక్ కీపర్ల తొలగింపు

70చూసినవారు
ముసునూరులో ఇద్దరు బుక్ కీపర్ల తొలగింపు
ముసునూరు మండలం చెక్కపల్లిలో డ్వాక్రా సంఘాల ఇద్దరు బుక్ కీపర్లలను తొలగించినట్లు ముసునూరు ఐకెపి సిసి సతీష్ తెలిపారు. ఆదివారం మాట్లాడుతూ, ఈ మేరకు గ్రామంలో డ్వాక్రా సంఘాలు తీర్మానాలు చేశాయని వివరించారు. అయితే గ్రామంలో డ్వాక్రా సంఘాల నిధులు గోల్ మాల్ పై మంత్రి కొలుసు పార్థసారథి ముసునూరు మండల ఐకెపి అధికారుల పనితీరుపై ఆగ్రహం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. అధికారులు విచారణ చేస్తున్నట్లుగా తెలిపారు.

సంబంధిత పోస్ట్