నూజివీడులో అధ్వానంగా చెత్త డంపింగ్ యార్డ్

నూజివీడు మున్సిపాలిటీ అధికారులు, సిబ్బంది నిర్లక్ష్యంతో చెత్త డంపింగ్ యార్డులా తయారవుతుంది. గత ఏడాది కాలంగా మున్సిపల్ కార్యాలయ ఆవరణలో చెత్తను ఇతర వ్యర్ధాలను బయటకు తరలించకపో వడంతో మున్సిపల్ కార్యాలయం ముందు చెత్త, ఇతర వ్యర్ధాలు పేరుకుపోయాయి. ఎన్నికల సమయంలో మున్సిపాలిటీ పరిధిలో తొలగించిన బ్యానర్లు, సైన్ బోర్డులు సైతం కార్యాలయ ఆవరణలో పడవేయడంతో ఈ ప్రాంతం చెత్త డంపింగ్ యార్డును తలపిస్తోంది.