చాగంటిపాడు: తండ్రి హత్య కేసులో విస్తుపోయే నిజాలు

70చూసినవారు
చాగంటిపాడు: తండ్రి హత్య కేసులో విస్తుపోయే నిజాలు
తోట్లవల్లూరు మండలం చాగంటిపాడులో దారుణం జరిగింది. మంగళవారం ఇక్కడ జరిగిన హత్య కేసులో విస్తుపోయే నిజాలు వెలుగులోకి వస్తున్నాయి. ఆనంద్ డబ్బుల విషయంలో భార్యతో తరచూ గొడవపడే వాడేనని తెలిసింది. మద్యం మత్తులో భార్య సుపాదపై దాడికి దిగాడని వెలుగులోకి వచ్చింది. విషయం తెలుసుకున్న కుమారులు, తండ్రిని నిలదీశారు. ఈ క్రమంలో మాటామాటా పెరిగి రాడ్తో తలపై కొట్టారు. ఈ క్రమంలో ఆనంద్ అక్కడికక్కడే మృతి చెందినట్లు తెలిపారు.

సంబంధిత పోస్ట్