పామర్రు: వృద్ధుల సంక్షేమ సంఘ వ్యవస్తాపకులు పూసల మృతి
By D.Nataraju 76చూసినవారుపామర్రు మానవత డైరెక్టర్, పామర్రు నియోజకవర్గ వృద్ధుల సంక్షేమ సంఘ వ్యవస్తాపకులు పూసల కోటేశ్వరరావు అనారోగ్యంతో శనివారం తెల్లవారుజామున మృతి చెందారు. వితరణ శీలి, సంఘ సేవకులు పూసల కోటేశ్వరరావు మృతి తమను ఎంతగానో బాధించిందని ఉయ్యూరు మానవతా సంస్థ డైరెక్టర్ కొలసాని రవికుమార్, సభ్యులు మహంకాళి పవన్ ఫణి కుమార్, చేవూరి రవి సుధాకర్ తదితరులు పేర్కొన్నారు.