లోక్ అదాలత్ ద్వారా కేసుల పరిష్కారం లభిస్తుందని జ్యుడీషియల్ మెజిస్ట్రేట్ ఫస్ట్ క్లాస్ కోర్టు న్యాయమూర్తి స్వర్ణలత వోల్గా పేర్కొన్నారు. మొవ్వ న్యాయస్థానంలో శనివారం నిర్వహించిన జాతీయ లోక్ అదాలత్ ద్వారా 274 కేసులు పరిష్కారమైనట్లు ఆమె తెలిపారు. మొవ్వ న్యాయస్థాన పరిధిలోని కూచిపూడి, ఘంటసాల, చల్లపల్లి మోపిదేవి పోలీస్ స్టేషన్లకు సంబంధించిన కేసులు పరిష్కరించినట్లు తెలిపారు.