మొవ్వ మండల పరిధిలోని చిన్నముత్తేవి గ్రామంలోని వంతెనపై ఉన్న ఇనుప ఫ్లాట్ ఫాం పూర్తిగా శిథిలావస్థకు చేరింది. శుక్రవారం తెల్లవారుజాము నుంచి భారీ వర్షం కురవడంతో ప్లాట్ ఫామ్ రేకులపై నీరు నిలిచి వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. పలుచోట్ల రేకులు పాడైపోవడంతో ప్రమాదకరంగా ప్రయాణం చేస్తున్నట్టు ప్రజలు తెలిపారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి ప్లాట్ ఫామ్ బాగు చేయాలని ప్రజలు కోరుతున్నారు.