మొవ్వ గ్రామంలోని తాతినేని వారి ఇలవేల్పు అంకమ్మ తల్లి నెల సంబరం ఆదివారం మేళతాళాలు డప్పు విన్యాసాల నడుమ ఘనంగా జరిగింది. గ్రామంలో ఊరేగింపు నిర్వహించగా భక్తులు అమ్మవారిని దర్శించుకుని పూజలు చేశారు. ఈ సందర్భంగా పోతురాజు గడతో అమ్మవారి ఘటం ఊరేగింపు నిర్వహించారు. అనంతరం మొక్కుబడులను భక్తులు చెల్లించుకున్నారు. ఈ సందర్భంగా గ్రామంలో పండుగ వాతావరణం నెలకొంది.