మొవ్వ మండలం కొండవరం గ్రామంలో పట్టాభి రామాలయంలో పామర్రు ఎమ్మెల్యే వర్ల కుమార్ రాజా బుధవారం రాత్రి ప్రత్యేక పూజలు నిర్వహించారు. గ్రామంలో ఓ కార్యక్రమానికి హాజరై స్వామివారిని దర్శించుకుని మొక్కు తీర్చుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ ప్రతినిధులు వారిని ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.