మొవ్వ మండలం వేములమడ గ్రామంలో శ్రీ రేణుక అంకమ్మ అమ్మవారి విగ్రహ ప్రతిష్ఠ వేడుక శుక్రవారం ఘనంగా జరిగింది. పామర్రు ఎమ్మెల్యే వర్ల కుమార్ రాజా అమ్మవారిని దర్శించుకునే ప్రత్యేక పూజ కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ వేద పండితులు ఎమ్మెల్యేకు ఆశీర్వచనాలు అందజేశారు. అనంతరం ఏర్పాటు చేసిన ఉచిత మజ్జిగ, మంచినీటి చలివేంద్రాన్ని ఎమ్మెల్యే ప్రారంభించారు. కూటమి నేతలు పాల్గొన్నారు.