మొవ్వ: 'రేపటి నుంచి వితంతు పింఛన్లు పంపిణీ'

82చూసినవారు
మొవ్వ: 'రేపటి నుంచి వితంతు పింఛన్లు పంపిణీ'
మొవ్వ మండలంలో ఈ నెల 12 నుంచి వితంతు పింఛన్లు పంపిణీ చేయనున్నట్లు ఎంపీడీవో రమాదేవి మంగళవారం సాయంత్రం తెలిపారు. మండల వ్యాప్తంగా 91 మందికి స్పౌజ్ పింఛన్లు మంజూరయ్యాయని ఆమె పేర్కొన్నారు. అవిరిపూడి, అయ్యంకి, చినముత్తేవి, కాజా, కోసూరు, కూచిపూడి, మంత్రిపాలెం, మొవ్వ, నిడమోలు, పెదముత్తేవి, పెదపూడి, పెడసనగల్లు, వేములమడ గ్రామాలలో లబ్ధిదారులు ఉన్నట్లు ఆమె వివరించారు.

సంబంధిత పోస్ట్