ఈ నెల 22న ఉయ్యూరులో జరిగే శోభాయాత్రను విజయవంతం చేయాలని హనుమాన్ భక్త బృందం కోరారు. శనివారం ఊయ్యురు 5వ వార్డులోని శ్రీ గంగానమ్మతల్లి సన్నిధి ప్రతినిధులకు కరపత్రాలు అందజేశారు. స్థానికంగా ఆలయాలు, భక్త బృందాలు, పలు సంఘాలను, వర్గాలను కలిసి ఉయ్యూరులో జరగనున్న శ్రీ హనుమాన్ శోభాయాత్రలో పాల్గొనవలసిందిగా కోరారు. వీరబాబు, దుర్గా ప్రసాద్, చిన్నా, వెంకటేశ్వరరావు పాల్గొన్నారు.