పామర్రు: అర్జీదారులకు ఇబ్బందులు కలుగకుండా చూడాలి

58చూసినవారు
కొత్త రేషన్ కార్డు కోసం దరఖాస్తు చేసుకునే అర్జీదారులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా చూడాలని ఉద్యోగులకు ఎమ్మెల్యే వర్ల కుమార్ రాజా సూచించారు. గురువారం పామర్రు టౌన్ పంచాయితీ ఆఫీస్ లో క్రొత్త రేషన్ కార్డుల దరఖాస్తు ప్రక్రియను పరిశీలించి పంచాయతీ ఉద్యోగులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. కూటమి ప్రభుత్వ ఏర్పాటైన తర్వాత తొలిసారిగా నూతన రేషన్ కార్డుల కోసం ప్రజల నుంచి దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు తెలిపారు.

సంబంధిత పోస్ట్