ఎస్సీ కులగణనపై నిర్వహిస్తున్న అభ్యంతరాల (ఆడిట్ ప్రక్రియ) స్వీకరణ గడువును జనవరి 7వ తేదీ వరకు పొడిగిస్తున్నట్లు పామర్రు నియోజకవర్గం శాసనసభ్యులు వర్ల కుమార్ రాజా తెలిపారు. డిసెంబర్ 31వ తేదీతో గడువు ముగియనుండటంతో వారం రోజులు పొడిగిస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రత్యేక ఉత్తర్వులు జారీ చేసిందని గురువారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ప్రభుత్వం 265 నంబరు జీవో విడుదల చేసినట్లు తెలిపారు.