పామర్రు మండలం ఉండ్రపూడి పోలవరం క్రాస్ రోడ్డు లో విచ్చేసి ఉన్న శ్రీ వీరాంజనేయ స్వామి వారి దేవస్థానము నకు విజయవాడ వాస్తవ్యులు ఉప్పలపాటి ఉమాదేవి 865 గ్రాముల వెండి నక్షత్ర హారతిని ఆదివారం ఉదయం సమర్పించారు. సుమారు రూ. 1, 00, 500ల విలువ ఉంటుందని దాతలు తెలిపారు. దాతలను శాలువాతో సత్కరించి ప్రత్యేక పూజలు చేయించి స్వామివారికి నక్షత్ర హారతి ఇచ్చారు. ఈ కార్యక్రమంలో భక్తులు తదితరులు పాల్గొన్నారు.