ప్రజా మద్దతుతో కూటమి ప్రభుత్వం పాలన సాగిస్తున్నట్లు పామర్రు ఎమ్మెల్యే వర్ల కుమార్ రాజా పేర్కొన్నారు. ఆదివారం ఉదయం పామర్రు పట్టణంలో సుపరిపాలనకు తొలి అడుగు కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, ప్రతి ఇంటికి సంక్షేమ పథకాలు అందిస్తున్నట్లు తెలిపారు. రాష్ట్రంలో గుంతలు లేని రహదారుల నిర్మాణం చేపట్టడం జరిగిందన్నారు. తల్లికి వందనం పధకంతో ప్రతి విద్యార్థికి మేలు జరిగిందన్నారు.