ఎటువంటి అనుమతులు లేకుండా ఇసుక తరలిస్తున్న లారీలను గుడివాడ డి. ఎస్. పి ధీరజ్ వినీల్ సీజ్ చేశారు. గురువారం పామరు పట్టణ సమీపంలో వాహనాలు తనిఖీ చేస్తున్న సమయంలో తోట్లవల్లూరు మండలం రొయ్యూరు నుంచి కైకలూరు, కలిదిండి వైపు వెళ్తున్న 7 లారీలను డి. ఎస్. పి ధీరజ్ వినీల్ సీజ్ చేసి పామర్రు పోలీసులకు అప్పగించారు. పామర్రు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.