సొసైటీ ఫర్ ఎంప్లాయిమెంట్ జనరేషన్ కార్యక్రమంలో భాగంగా సీడ్ యాప్ ముస్లిం, క్రిస్టియన్, బుద్ధిష్ట్, పార్సి, జైన్ వర్గాలకు చెందిన నిరుద్యోగులైన యువతకు ఉచిత శిక్షణ ఇవ్వడం జరుగుతుందని మైనారిటీస్ ఫైనాన్సు కార్పొరేషన్ కార్యనిర్వాహక సంచాలకులు ఫర్జానాబేగం శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. శిక్షణ కాలంలో వసతి, భోజనం, యూనిఫాం, స్టడీ మెటీరియల్ తో పాటు శిక్షణ పూర్తయిన తరువాత ఉద్యోగ ఉపాది అవకాశం కల్పించడం జరుగుతుందన్నారు.