బడుగు, బలహీన వర్గాల ఆశాజ్యోతి బాబు జగ్జీవన్ రామ్ అని పామర్రు ఎమ్మెల్యే పట్ల కుమార్ రాజా పేర్కొన్నారు. ఆదివారం పామర్రు టౌన్ చాట్లవానిపురంలో జరిగిన డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ వర్ధంతి సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ అణగారిన వర్గాలను ఉన్నత స్థితికి ఎదిగేలా చేసిన మహనీయుడు జగ్జీవన్ రామ్ అన్నారు. టిడిపి నేతలు పాల్గొన్నారు.