ఇళ్ల స్థలాలకు కేటాయించిన భూమి ఆక్రమంలో గురైన సంఘటన బుధవారం పామర్రు నియోజవర్గంలో వెలుగు చూచింది. తోట్లవల్లూరు మండలం యాకమూరు గ్రామంలో ప్రజల ఇళ్ల స్థలాలకు కేటాయించిన భూమిని కొంతమంది దళారులు ఆక్రమించుకొని వ్యవసాయం చేస్తున్నారు. ఫ్లాట్లుగా విభజించినా సర్వే రాళ్లు సైతం కనిపిస్తున్నాయి. ప్రజలకు చెందాల్సిన భూమిని కొంతమంది వ్యక్తులు ఆక్రమించుకుని కబ్జా చేసి ఈ విధంగా చేస్తున్నారని ప్రజలు వాపోతున్నారు.