బేసిక్ హెల్త్ మెడికల్ ప్రాక్టీషనర్స్ అసోసియేషన్, ఏపీ ప్రాథమిక వైద్య సంఘాల పిలుపు మేరకు వారి సమస్యలపై వినతిపత్రం అందజేశారు. గురువారం ఎమ్మెల్యే వర్ల కుమార్ రాజాకు తెదేపా కార్యాలయము నందు గ్రామీణ వైద్యులు వారి సమస్యలు గూర్చి అసెంబ్లీలో ప్రస్తావించి మాకు న్యాయం చేయాలని కోరుతూ వారి సమస్యలను తెలియజేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో సంఘ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఉమాశంకర్, కోలా వెంకటేశ్వరరావు పాల్గొన్నారు.