తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు పార్టీ అధినాయకత్వం అన్నివేళల అండగా ఉంటుందని పామర్రు ఎమ్మెల్యే వర్ల కుమార్ రాజా అన్నారు. పామర్రు మండలం కురుమద్దాలి గ్రామంలో ఇటీవల మరణించిన మిన్నుకూరి మేరీ అనే పార్టీ కార్యకర్త కుటుంబ సభ్యులకు ఎమ్మెల్యే కుమార్ రాజా గురువారం 5 లక్షల ఇన్సూరెన్స్ చెక్కును అందజేశారు. మంత్రి లోకేష్ ముందు చూపుతో సభ్యత్వం ఉన్న కార్యకర్తకు ఇన్సూరెన్స్ సదుపాయం కల్పించడం మంచి విషయం అన్నారు.