కృష్ణా జిల్లా పామర్రు నియోజకవర్గానికి చెందిన ఓ యువతి గుడ్లవల్లేరు కళాశాలలో చదువుతుంది. ప్రేమ విఫలమై బాధతో మందు తాగాలని ఉంది అని నాలుగు రోజుల క్రితం బీచ్ ఫెస్టివల్ లో పరిచయమైన యువకుడిని అడగగా ఆతను మందు తీసుకోని రాగ పొలాల్లోకి వెళ్లి తాగారు. అక్కడ అధికంగా తాగి నడవలేని స్థితిలో ఉన్న ఆమెను అతను తీసుకెళ్ల లేకపోయాడు. అతని స్నేహితులు వచ్చి సహాయం చేస్తుండగా ఓ యువకుడు ఇది చూసి విద్యార్థినిపై ఏ అఘాయిత్యం జరుగుతుందోనని పోలీసులకు సమాచారం ఇచ్చాడు. పోలీసులు ఆమెను స్టేషన్ కు తీసుకెళ్లగా అక్కడ వీరంగం సృష్టించింది. అనంతరం తల్లిదండ్రులకు అప్పగించారు.