పమిడిముక్కల మండలం మంటాడ గ్రామంలో జరిగిన మేరుగ వారి దేవరమ్మ తల్లి కొలుపు సంబరం శనివారం ఘనంగా ప్రారంభమయింది. పామర్రు ఎమ్మెల్యే వర్ల కుమార్ రాజా సంబరంలో పాల్గొనగా, ఆలయ కమిటీ ప్రతినిధులు ఆయనకు ఘన స్వాగతం పలికారు. డప్పు వాయిద్యాల నడుమ మేళతాళాలతో అమ్మవారి గ్రామోత్సవం జరిగింది. ఈ సందర్భంగా అమ్మవారి ప్రసాదాన్ని ఎమ్మెల్యే కమిటీ సభ్యులు అందజేసి సత్కరించారు. ఈ కార్యక్రమంలో నాయకులు పాల్గొన్నారు.