పెదపారుపూడి: పోలీస్ స్టేషన్ లో డీఎస్పీ ఆకస్మిక తనిఖీ

66చూసినవారు
పెదపారుపూడి: పోలీస్ స్టేషన్ లో డీఎస్పీ ఆకస్మిక తనిఖీ
పెదపారుపూడి పోలీస్ స్టేషన్ ను డీఎస్పీ ధీరజ్ శుక్రవారం సాయంత్రం ఆకస్మిక తనిఖీ చేశారు. తనిఖీల్లో భాగంగా ప్రతి రికార్డును పరిశీలించారు. ఉమెన్ సేఫ్టీకి ప్రాధాన్యత ఇచ్చి సత్వరమే స్పందించాలని సిబ్బందికి సూచించారు. బహిరంగ మద్యపానాన్ని అరికట్టాలని తెలిపారు. పేకాట, కోడి పందాలు ఆడేవారిపై చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. సైబర్ నేరాల పట్ల ప్రజలకు అవగాహన కల్పించి చైతన్య పరచాలన్నారు.

సంబంధిత పోస్ట్