పెదపారుపూడి మండలం యలమర్రు గ్రామంలో కనపడకుండా పోయిన బాలుడి కేసును ఎస్ఐ ప్రవీణ్ కుమార్ రెడ్డి సాంకేతిక సహాయంతో పరిష్కరించారు. తన పోలీస్ సిబ్బందితో కలిసి బాలుడిని గుర్తించి సురక్షితంగా తల్లిదండ్రులకు శుక్రవారం రాత్రి అప్పగించారు. దీంతో తల్లిదండ్రులు ఆనందం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఎస్ఐ పిల్లలపై తల్లిదండ్రులు శ్రద్ధ వహించాలని సూచించారు.