పామర్రు టౌన్ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో పార్టీ 15వ ఆవిర్భావ దినోత్సవాన్ని బుధవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే, రాష్ట్ర అధికార ప్రతినిధి కైలే అనిల్ కుమార్ పార్టీ జెండా ఎగురవేసి, వైఎస్సార్ విగ్రహానికి నివాళులర్పించారు. అనంతరం కేక్ కట్ చేసి వైసీపీ నాయకులు, కార్యకర్తలకు పంచి పెట్టారు.