బంటుమిల్లి బస్టాండ్ దుస్థితిపై ప్రయాణికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వర్షాకాలంలో చుట్టూ నీరు నిలిచి, బురద నిండిపోయి నరకప్రాయంగా మారుతోంది. బస్సులు రాగానే బురద ఎగిరి ప్రయాణికులపై పడుతోంది. అధికారుల నిర్లక్ష్యమే దీనికి కారణమని విమర్శలు వస్తున్నాయి. ప్రతి రోజు వందల మంది ప్రయాణిస్తున్నా సమస్యపై చర్యలు లేకపోవడం బాధాకరం.